భారతదేశం, సెప్టెంబర్ 20 -- రూ. 35,000 ధరలో సరికొత్త ఫీచర్లతో కూడిన స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నారా? అయితే.. ఒప్పో ఇటీవల న్యూ జెన్​ ఎఫ్ సిరీస్ మోడళ్లను విడుదల చేసింది. ఇందులో టాప్-ఎండ్ మోడల్ అయిన ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 5జీ ప్రస్తుతం మార్కెట్​లో బాగా ప్రచారం పొందుతోంది. దీని మన్నిక, శక్తివంతమైన పనితీరు, కెమెరా ఫీచర్ల గురించి బాగా చర్చ జరుగుతోంది. కాగా మార్కెట్​ల ఉన్న ఇతర మిడ్-రేంజ్ ఫోన్ల నుంచి ఇది గట్టి పోటీని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా, నథింగ్ ఫోన్ 3ఏ ప్రో నుంచి దీనికి గట్టి పోటీ ఉంది. మీరు కూడా ఇదే బడ్జెట్‌లో ఫోన్ కొనాలనుకుంటే, ఈ రెండు ఫోన్‌ల మధ్య పోలికలను తెలుసుకోండి..

ఒప్పో ఎఫ్31 ప్రో ప్లస్ 8జీబీ+ 256జీబీ వేరియంట్‌కు ప్రారంభ ధర రూ. 32,999 గా ఉంది. అలాగే, 12జీబీ+ 256జీబీ స్టోరేజ్ వేరియంట్‌కు రూ. 34,999 ధరను నిర్ణయించారు.

మరోవైపు నథింగ్ ఫో...