భారతదేశం, సెప్టెంబర్ 18 -- హాట్ బ్యూటీ శ్రియా శరణ్ హాట్ హాట్ కామెంట్లు చేసింది. ఆన్ కెమెరా రొమాన్స్ ను ఎంజాయ్ చేస్తానని పేర్కొంది. తాజాగా మిరాయ్ మూవీలో తన యాక్టింగ్ తో మరోసారి అదరగొట్టింది శ్రియా. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం 'ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో'లో పాల్గొంది సినిమా టీమ్. హీరో తేజ సజ్జా, హీరోయిన్ రితికా నాయక్, జగపతి బాబు, శ్రియా శరణ్ ఈ కామెడీ షోలో పార్టిసిపేట్ చేశారు.

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షోలో ఇటీవల మిరాయ్ టీమ్ పాల్గొంది. మూవీ ప్రమోషన్ల కోసం తేజ సజ్జా, రితికా నాయక్, జగపతి బాబు, శ్రియా శరణ్ వెళ్లారు. ఈ షోలో హోస్ట్ కపిల్ శర్మ అడిగిన ప్రశ్నకు శ్రియా శరణ్ కామెంట్లు వైరల్ గా మారాయి. సినిమాలో ఏది చేయడం కష్టంగా ఉంటుంది, రిస్కీ స్టంట్ ఏదని తేజ సజ్జాను కపిల్ ప్రశ్నించాడు. అప్పుడు రొమాన్స్ కష్టంగా ఉంటుందని తేజ బదులిచ్చాడు. దీంతో రియల్లీ అని శ్...