భారతదేశం, జనవరి 4 -- తమిళ దిగ్గజ దర్శకుడు భారతీరాజా ఆసుపత్రిలో చేరారు. ఊపిరాడక ఇబ్బంది పడటంతో ఆయన్ని కుటుంబ సభ్యులు హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఆయన వయసు 84 ఏళ్లు. ఆయన ఆరోగ్య పరిస్థితి ఇప్పుడు నిలకడగా ఉందని ఎంజీఎం హాస్పిటల్స్ వెల్లడించింది. భారతీరాజా తెలుగులో సూపర్ స్టార్ కృష్ణ‌తో జమదగ్ని సినిమా తీశారు.

సినీ ఎక్స్‌ప్రెస్ కథనం ప్రకారం ఆసుపత్రి విడుదల చేసిన ప్రకటనలో "ప్రముఖ చిత్ర దర్శకులు భారతీరాజా శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటంతో ఎంజీఎంహెల్త్‌కేర్, అమీన్‌జికరైలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌ (ఐసీయూ)లో తగిన వైద్య సంరక్షణ పొందుతున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి స్థిరంగా ఉంది. మా వైద్య నిపుణుల బృందం ఆయనను నిశితంగా పర్యవేక్షిస్తోంది. అవసరమైనప్పుడు మరిన్ని అప్‌డేట్‌లు తెలియజేస్తాం'' అని పేర్కొంది.

భారతీరాజా తమిళ సినిమాల్లో ...