భారతదేశం, సెప్టెంబర్ 19 -- 90ల్లో బాలీవుడ్ లో లవ్ పెయిర్ అంటే ముందుగా సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్ జోడీ పేరు వినిపించేది. వీళ్లు అప్పుడు గోల్డెన్ పెయిర్ గా నిలిచారు. కానీ ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఈ జంట విడిపోయింది. వీళ్ల లవ్ కు ఎండ్ కార్డు పడింది. అయితే అప్పుడు ఐశ్వర్య రాయ్ పై సల్మాన్ ప్రేమ ఎలా ఉండేదో సీనియర్ నటి, హీరోయిన్ హిమాని శివపురి తాజాగా రివీల్ చేసింది.

అప్పటి నుంచి ఇప్పటివరకూ ఇండియాలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా సల్మాన్ ఖాన్ పేరు వినిపిస్తూనే ఉంది. అయితే ఐశ్వర్య రాయ్ తో రిలేషన్ షిప్ లో ఉన్న సమయంలో సల్మాన్ ఖాన్ ఎంతో ప్రేమ చూపించేవాడని తెలిసింది. ఐశ్వర్య సినిమా షూటింగ్ సెట్స్ లో సల్మాన్ రెగ్యులర్‌గా కనిపించేవావడని హిమాని శివపురి రెడ్ ఎఫ్ఎమ్ పాడ్ కాస్ట్ లో వెల్లడించింది. "ఐశ్వర్య, సల్మాన్ రిలేషన్ షిప్ చాలా స్ట్రాంగ్‌గా ఉన్న టైమ్ ...