భారతదేశం, జూలై 7 -- ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్​) ఈ సంవత్సరం ప్రొబేషనరీ ఆఫీసర్ (పీఓ) ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్​ పాటర్న్స్​లో కీలక మార్పులు చేసింది. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

ఐబీపీఎస్​ పీఓ 2025 రిజిస్ట్రేషన్​ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అభ్యర్థులు జులై 21, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంకా దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ibps.inని సందర్శించి దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రిలిమినరీ పరీక్షలో మార్పులు:

ప్రిలిమినరీ పరీక్షల్లో, గత సంవత్సరంతో పోలిస్తే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ సబ్జెక్టుకు కేటాయించిన మార్కులను 35 నుంచి 30కి తగ్గించారు. అదే సమయంలో, రీజనింగ్ ఎబిలిటీ మార్కులను 30 నుంచి 40కి పెంచారు. ఓవరాల్ ప్యాటర్న్ మాత్రమే మారగా.. మార్కులు, పరీక్షా సమయం గతంలో ఉన్నట్టే కొనసాగుతాయి.

మెయిన...