భారతదేశం, నవంబర్ 9 -- బడ్జెట్​ కారణంగా ఐఫోన్​ 17 కొనేందుకు వెనకడుగు వేస్తున్నారా? అయితే అదే ఎక్స్​పీరియెన్స్​ని ఇచ్చే ఐఫోన్​ 16 మోడల్​పై అదిరిపోయే డిస్కౌంట్​ లభిస్తోందని మీరు తెలుసుకోవాలి! ప్రముఖ ఈ-కామర్స్​ సంస్థ ఫ్లిప్‌కార్ట్.. ఐఫోన్ 16పై మంచి ఆఫర్‌ను అందుబాటులోకి తెచ్చింది. దీనివల్ల కొనుగోలుదారులు మంచి ధరకు ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. కాబట్టి, తాజా ఐఫోన్ 16 డీల్ వివరాలు, అలాగే బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను ఎలా ఉపయోగించుకోవచ్చో ఇక్కడ తెలుసుకోండి..

ప్రస్తుతం, ఐఫోన్ 16 బేస్ 128జీబీ వేరియంట్ ధర సాధారణంగా రూ. 69,900గా ఉంది. కానీ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం రూ. 62,999కే అందుబాటులో ఉంది. దీని ద్వారా కొనుగోలుదారులకు 10 శాతం తగ్గింపు లభిస్తుంది! ఈ డిస్కౌంట్‌తో పాటు బ్యాంక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లను ఉపయోగించుకోవడం ద్వారా స్మార్ట్‌ఫోన్ ధరను...