భారతదేశం, డిసెంబర్ 22 -- దేశీయ స్టాక్ మార్కెట్​లో ఆన్‌లైన్ బ్రోకింగ్ దిగ్గజం 'గ్రో' (Groww) షేర్ల జోరు కొనసాగుతోంది. గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ జెఫరీస్ ఈ స్టాక్‌పై బుల్లిష్‌గా ఉండటంతో సోమవారం దలాల్ స్ట్రీట్‌లో ఈ షేరు ధర ఒకానొక సమయంలో 6.5% మేర ఎగబాకింది. బెంగళూరు కేంద్రంగా పనిచేసే ఈ సంస్థ వృద్ధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయని పేర్కొంటూ జెఫరీస్ తన కవరేజీని ప్రారంభించింది.

లిస్టింగ్ అయినప్పటి నుంచి గ్రో షేరు ఇప్పటికే 72% పెరిగింది. రూ. 100 ఇష్యూ ధరతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు రెట్టింపు ధర వద్ద ట్రేడ్ అవుతోంది. మరి ఈ గ్రో స్టాక్​ని ఇప్పుడు కొనాలా? అమ్మేయాలా? లేక హోల్డ్​ చేయాలా? నిపుణులు ఏమంటున్నారంటే..

గ్రో షేరుకు జెఫరీస్ రూ. 180 టార్గెట్ ధరను నిర్ణయించింది! ఇది శుక్రవారం నాటి ముగింపు ధరతో పోలిస్తే దాదాపు 12% పెరుగుదలను సూచిస్తోంది. 2026-28 ఆర్థిక...