భారతదేశం, నవంబర్ 15 -- మెట్రో నగరాల్లో నివసిస్తూ ఉద్యోగాలు చేసే యువతకు రోజూ వంట చేసుకోవడం పెద్ద సవాలుగా మారింది. ఆఫీసులో పని ఒత్తిడి, డెడ్‌లైన్లు, గంటల తరబడి ట్రాఫిక్ ప్రయాణాలు, నెలవారీ ఖర్చుల లెక్కల మధ్య ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం కష్టమవుతోంది. కనీసం సమతుల్య ఆహారం తీసుకోవడం కూడా నేడు ఒక భారంగా తయారైంది. ఇప్పటికే బిజీగా ఉన్న దినచర్యలో మెనూ ప్లాన్ చేసుకోవడం, శరీరానికి అవసరమైన ప్రోటీన్, కేలరీలను లెక్కించుకోవడం అదనపు బాధ్యతల్లా అనిపిస్తున్నాయి.

హైదరాబాద్‌లోని హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ ప్రాంతాలతో పాటు విజయవాడ, విశాఖపట్నం వంటి నగరాల్లో లక్షలాది మంది యువ సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. హాస్టళ్లు, పీజీలలో దొరికే ఆహారం రుచిగా ఉండక, రోజూ ఆన్‌లైన్‌లో రెస్టారెంట్ ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే ఆరోగ్యం దెబ్బతింటుందేమోన...