భారతదేశం, ఆగస్టు 1 -- ఆగస్టు నెల ప్రారంభంతో దేశంలో సామాన్య ప్రజల జేబులతో ముడిపడి ఉన్న పలు ఆర్థిక, బ్యాంకింగ్ నిబంధనల్లో కీలక మార్పులు అమల్లోకి వచ్చాయి. పన్ను చెల్లింపుదారులు, బ్యాంక్ ఖాతాదారులు, రైల్వే ప్రయాణికులతో పాటు సాధారణ వినియోగదారులపై ఈ మార్పులు నేరుగా ప్రభావం చూపనున్నాయి.

కొన్ని బ్యాంకుల రుసుముల సవరణలు, సీకేవైసీ 2.0 అమలు, ఆర్బీఐ ద్రవ్య పరపతి సమీక్ష నిర్ణయాలతో పాటు వ్యాపారులు, నిపుణులకు ఆదాయపు పన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలు గడువు ఈ నెలలోనే ముగియనుంది. అదనపు రుసుములు, జరిమానాల పడకుండా సరైన ఆర్థిక నిర్ణయాలు తీసుకునేందుకు ఈ నెలలో అమల్లోకి వచ్చిన ఆ 5 ముఖ్యమైన మార్పులేంటో వివరంగా తెలుసుకుందాం:

సాధారణ వేతనజీవులకు (ఐటీఆర్-1, ఐటీఆర్-2) జూలై 31తో ముగిసిన గడువు తర్వాత, ఇప్పుడు తదుపరి వర్గం పన్ను చెల్లింపుదారులపై దృష్టి పడింది. అసెస్‌మెంట్ ఇ...