భారతదేశం, ఫిబ్రవరి 10 -- భవిష్యత్తు అంతా అంతరిక్షం, విమానయాన రంగాలదేనని ఐఐటీ మద్రాస్ మరోసారి నిరూపించింది. సాంకేతిక విద్యను అందరికీ చేరువ చేసే లక్ష్యంతో, ఏరోనాటిక్స్, స్పేస్ టెక్నాలజీలో ఒక ప్రత్యేకమైన ఆన్‌లైన్ బీఎస్ (బ్యాచిలర్​ ఆఫ్​ సైన్స్​) ప్రోగ్రామ్‌ను సంస్థ తాజాగా ప్రారంభించింది. నేటి యువతకు విమానయానం, అంతరిక్ష పరిశోధన రంగాల్లో ఉన్న ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఈ కోర్స్ ఒక చక్కని వేదిక కానుంది.

ఐఐటీ మద్రాస్ ప్రాంగణంలో ఇటీవలే జరిగిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్ ప్రొఫెసర్ వి. కామకోటి ఈ ప్రోగ్రామ్‌ను అధికారికంగా లాంచ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్​ఏఎల్​) సీఎండీ డాక్టర్ డీకే సునీల్, ఇండిగో ఎయిర్‌లైన్స్ మాజీ చైర్మన్ డాక్టర్ వీ సుమంత్రన్ వంటి ప్రముఖులు వర్చువల్‌గా పాల్గొనడం విశేషం.

ఈ కోర్సును అత్యంత సరళం...