భారతదేశం, జనవరి 24 -- తెలంగాణకు ఆత్మగా ఉన్న సింగరేణిపై కట్టుకథలు అల్లుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన. కట్టుకథలు, ఊహాగానాలతో రోజుకో కథ వండివారుస్తున్నారన్నారు. ఎవరి ప్రయోజనాల కోసమో ఈ కథనాలు వస్తున్నట్టు అనిపిస్తోందని వ్యాఖ్యానించారు.

"ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలు వస్తున్నట్లు కనిపిస్తోంది. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో..? తొలిపలుకుల రాతల వెనుక ఎవరి ప్రయోజనాలు దాగున్నాయో..? అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థపై నిందలు మోపుతున్నారు" అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు.

సింగరేణి కార్మికుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలా కథనలు ఉన్నాయని భట్టి చెప్పారు. ఇలాంటి బాధ్యతారాహిత్య చర్యలను తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించమని స్పష్టం చ...