భారతదేశం, జూన్ 27 -- ఏపీ సీఆర్డీఏ కమిషనర్‌‌కు స్థాన చలనం తప్పదని అధికార వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. నాలుగేళ్లలో అమరావతికి ఓ రూపునివ్వాలని భావిస్తున్న కూటమి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా సీఆర్డీఏ అధికారుల పనితీరు లేదని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి.

ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్‌మెంట్‌ అథారిటీ- సీఆర్డీఏ బాధ్యతల్ని కాటమనేని భాస్కర్‌కు అప్పగించారు. కొద్ది నెలలకే మంత్రి నారాయణతో పొసగక పోవడంతో ఆయన్ని బదిలీ చేశారు. మంత్రి నారాయణ ఆదేశాలకు అనుగుణంగా పనిచేయక పోవడంతోనే కాటమనేని భాస్కర్‌ను సీఆర్డీఏ బాధ్యతల నుంచి తప్పించారనే ప్రచారం జరిగింది.

కాటమనేని బదిలీ వ్యవహారంపై ముఖ్యమంత్రి స్థాయిలో అధికారులకు సర్ది చెప్పాల్సి వచ్చింది. కాటమనేని భాస్కర్‌ బదిలీ తర్వాత కన్నబాబుకు సీఆర్డీఏ కమిషనర్ పదవి దక్కింది.

కమిషనర్...