ఏపీ తీరానికి కొట్టుకొచ్చిన బోటు.. అందులో నలుగురి మృతదేహాలు!
భారతదేశం, నవంబర్ 5 -- మురసు తీవ్ర తుపాను ధాటికి ప్రకాశం జిల్లా తీరంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. తుపాను సమయంలో సముద్రంలో గల్లంతైన తమిళనాడు మత్స్యకారుల బోటు కొత్తపట్నం బీచ్‌కు కొట్టుకొచ్చింది. అందులో నలుగురి మృతదేహాలు ఉన్నాయి. ఈ ఘటనకు సంబంధించి ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు కీలక వివరాలను వెల్లడించారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు తెలిపిన వివరాల ప్రకారం.. అక్టోబర్ 29న తమిళనాడు రాజధాని చెన్నై నుండి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే మురసు తీవ్ర తుపాను దూసుకొస్తున్న నేపథ్యంలో ప్రమాదం నుంచి తప్పుకునేందుకు వారి బోట్లను సమీపంలోని సురక్షిత తీరాలకు తరలించాలని అధికారులు సూచించారు.
ఆ సూచనల ప్రకారం తమిళనాడుకు చెందిన నాలుగు బోట్లు ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలకు చేరుకుని లంగరు వేశాయి. ఇందులో మూడు బోట్లు రామాయపట్నం పోర్టు వద్ద, ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.