భారతదేశం, జనవరి 25 -- ఏపీ ఇంటర్మీడియట్‌ ప్రాక్టికల్‌ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. సంబంధిత విద్యార్థులు ఇంటర్మీడియట్ బోర్డు అధికారిక వెబ్ సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. అంతేకాకుండా మనమిత్ర వాట్సాప్ ద్వారా కూడా వీటిని పొందవచ్చని పేర్కొన్నారు.

ఇక ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మనమిత్ర వాట్సాప్ ద్వారా ఈ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా 9552300009 వాట్సప్‌ నంబర్‌కు Hi అని మెసేజ్‌ సెండ్ చేయాలి. 'ఎడ్యుకేషన్‌ సర్వీసెస్‌' ఆప్షన్‌ను ఎంచుకోవాలి.ఇక్కడ మీ వివరాలను నమోదు చేసి హాల్ టికెట్ కాపీని పొందవచ్చు.

జనరల్‌ విభాగాల ప్రాక్టికల్‌ పరీక్షలు ఫిబ్రవరి ఒకటి నుంచి 10 వరకు నిర్వహిస్తారు. ప్రతి రోజూ రెండు విడతల్లో వీటిని పూర్తి చేస్తారు. ఈ పరీక్షల కోసం హాల్ టికెట్లను వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు.

మరోవైప...