భారతదేశం, మే 24 -- ఉపాధి కల్పన, పారిశ్రామిక వృద్ధి, ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ఏపీలో గనుల రంగాన్ని విస్తరించడంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తోందని మంత్రి కొల్లు రవీంద్ర ఇటీవల తెలిపారు. ఎమ్మెల్యే కె.ఇ.శ్యామ్ బాబుతో కలిసి కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామం సమీపంలో జియో మైసూర్ సర్వీసెస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్వహిస్తున్న జొన్నగిరి బంగారు గనిని సందర్శించారు. మైనింగ్, ఖనిజ శుద్ధి కార్యకలాపాలను సమీక్షించారు.

తనిఖీ సందర్భంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో జరుగుతున్న భూగర్భ గనుల తవ్వకం కార్యకలాపాలు, ఖనిజ వెలికితీత వ్యవస్థలు, బంగారం శుద్ధి ప్రక్రియలను మంత్రి పరిశీలించారు. ప్రస్తుతం దాదాపు 300 మీటర్ల లోతులో మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. రాబోయే సంవత్సరాల్లో వీటిని మరింత విస్తరించే అవకాశం ఉందని అన్నారు. అధికారుల ...