Andhrapradesh, ఆగస్టు 1 -- ఏపీలో మళ్లీ వర్షాలు కురవనున్నాయి. ఈ మేరకు వాతావరణశాఖ కీలక సూచన చేసింది. ఆగస్టు 1 నుంచి 7వ తేదీ వరకు ఏడు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. అంతేకాకుండా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే పడొచ్చని తెలిపింది.

ఆగస్టు 1 నుంచి 5 వరకు ఉత్తర కోస్తాంధ్ర, యానాం, దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తర కోస్తా , యానాం, దక్షిణ కోస్తా, రాయలసీమలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురువొచ్చని పేర్కొంది. ఈ మేరకు అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటన విడుదల చేసింది.

ఆగస్టు 5, 6, 7 తేదీల్లో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మొత్తంగా వారం రోజులపాటు అన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో ...