భారతదేశం, జూన్ 22 -- దుబాయ్‌లో నివసిస్తున్న ఒక భారతీయ వ్యాపారవేత్త చేసిన పని ఇప్పుడు సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. ఫాధర్స్​ డే సందర్భంగా.. ఏడాది వయస్సున్న తన కూతురికి ఆయన కస్టమైజ్డ్​ పింక్ రోల్స్ రాయిస్ కారును బహుమతిగా ఇచ్చాడు.

ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక వీడియోలో.. ANAX డెవలప్‌మెంట్స్ వ్యవస్థాపకుడు సతీష్ సాన్‌పాల్, తన భార్య తబిందా సాన్‌పాల్‌తో కలిసి తమ ఏడాది కూతురు ఇసాబెల్లా సాన్‌పాల్‌కు లగ్జరీ కారు తాళాలను బహుమతిగా ఇస్తూ కనిపించారు.

ఆ వీడియోలో మెరిసే మెటాలిక్ పింక్ కారు, దాని లోపల ఉన్న ఆల్-పింక్ లగ్జరీ ఇంటీరియర్స్ కనిపించాయి. కారు నేమ్‌ప్లేట్‌పై "అభినందనలు, ఇసాబెల్లా" అని రాసి ఉంది. అలాగే, కారు లోపల కింద ఉన్న ఒక చిన్న నోట్ ప్రకారం.. ఈ కారును పసిపాప కోసం ఇంగ్లాండ్‌లో కస్టమ్-మేడ్ చేసి, ఈ సందర్భం కోసం యూఏఈకి దిగుమతి చేసుకున్నారు....