భారతదేశం, జూలై 29 -- ఓటీటీలోకి డిఫరెంట్ జోనర్ల సినిమాలు వరుస కడతూనే ఉన్నాయి. కంటెంట్ బాగుండే సినిమాలపై డిజిటల్ ఆడియన్స్ మనసు పారేసుకుంటున్నారు. అలాంటి కంటెంట్ బాగున్న తమిళం సినిమా ఓటీటీలోకి రాబోతోంది. తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన 'మామన్' (Maaman) మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ కు రెడీ అయింది.

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఫ్యామిలీ కామెడీ డ్రామా 'మారన్' రెండు నెలల తర్వాత ఓటీటీలోకి రాబోతోంది. మే 16, 2025న ఈ సినిమా థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఆగస్టు 8 నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ5లో మామన్ సినిమా స్ట్రీమింగ్ అవుతుంది. తక్కువ బడ్జెట్ తో రూపొందించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టింది.

తమిళంలో పాపులర్ కమెడియన్ సూరి ఈ మామన్ సినిమాలో హీరోగా నటించాడు. తెలుగులో డబ్ అయిన సూర్య.. యముడు సినిమాలు, కాంచన 3 తదితర మూవీ...