Hyderabad, జూలై 5 -- ఒక హీరో స్టార్‌డమ్ ఎంత ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ రాబట్టడం చాలా కష్టం. ఎంత పెద్ద హీరో అయిన కథ, కథనాలు సరిగా లేకుంటే ఆడియెన్స్‌తోపాటు అభిమానులు కూడా థియేటర్లలో సరిగా సినిమాలను చూసే పరిస్థితి లేదు. ఎందుకంటే, థియేటర్లలో కాకుండే ఓటీటీల్లో ఎంచక్కా వీక్షించే అవకాశం ఉంది కాబట్టి.

ఇదిలా ఉంటే, సినిమా ఎలా ఉన్నా రూ. 100 కోట్లు రాబట్టగలిగే హీరోలు ఇండియాలో చాలా మందే ఉన్నారు. అయితే, ఏకంగా 18 సార్లు వరుసగా వంద కోట్ల కలెక్షన్స్ రాబట్టిన హీరో మాత్రం ఒకే ఒక్కరు ఉన్నారు. అది కూడా సోలో హీరోగా నటించి, ఆ 18 సినిమాలో ప్లాఫ్స్ కూడా ఉన్నప్పటికీ వాటిని వంద కోట్ల క్లబ్ వైపుకు నడిపించి ఏకైక ఇండియన్ హీరోగా చరిత్రలో ఒక్కడిగా పేరు తెచ్చుకున్నాడు.

ఈ మాటలు వింటే మనకు టక్కున గుర్తుకు వచ్చేది పాన్ ఇండియా స్టార్ ప్రభాస్. డార్లింగ్ ప్రభాస్ ...