భారతదేశం, జనవరి 27 -- వరుస ఫ్లాప్ లు ఎదుర్కొంటున్న విజయ్ దేవరకొండకు అర్జెంట్ గా ఓ హిట్ కావాలి. ఆ హిట్ అందించే బాధ్యతను డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. రాహుల్ సాంకృత్యాన్-విజయ్ దేవరకొండ కాంబినేషన్లో తెరకెక్కుతున్న రణబాలి హైప్ క్రియేట్ చేస్తోంది. రిపబ్లిక్ డే (జనవరి 26) సందర్బంగా రిలీజ్ చేసిన రణబాలి గ్లింప్స్ అదిరిపోయాయి.

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మూడో సినిమా రణబాలి. త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ఈ జోడీ ఇప్పటికే గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు చేశారు. ఇప్పుడు రణబాలిలో మరోసారి జతకట్టారు. ఈ మూవీ గ్లింప్స్ వైరల్ గా మారాయి. భారత ఇండిపెండెన్స్ కు ముందు బ్రిటీష్ వాళ్ల దురాగతాలను చాటేలా గ్లింప్స్ ఉంది. రౌద్ర రూపంలో లాస్ట్ లో విజయ్ దేవరకొండ ఎంట్రీ అదిరిపోయింది.

రణబాలి గ్లింప్స్ కు సోషల్ మీడియాలో పా...