భారతదేశం, జూలై 18 -- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి బిగ్​ అప్డేట్​! ఎస్‌బీఐ పీఓ (ప్రొబేషనరీ ఆఫీసర్) ప్రిలిమ్స్ పరీక్ష 2025 తేదీలను ఈ దిగ్గజ బ్యాంకింగ్​ సంస్థ తాజాగా విడుదల చేసింది. ప్రొబేషనరీ ఆఫీసర్ ప్రిలిమినరీ పరీక్షలు 2025 ఆగస్టు 2, 4, 5 తేదీల్లో జరగనున్నాయి. అభ్యర్థులు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్ sbi.co.inలో పరీక్ష తేదీలను చెక్​ చేయవచ్చు.

ప్రిలిమినరీ పరీక్ష 100 మార్కులకు ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. పరీక్షలో 3 విభాగాలు (ప్రతి విభాగానికి ప్రత్యేక సమయం ఉంటుంది) ఉంటాయి. అవి.. ఇంగ్లీష్ లాంగ్వేజ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, రీజనింగ్ ఎబిలిటీ. పరీక్ష వ్యవధి 1 గంట!

ఎస్​బీఐ పీఓ ప్రిలిమినరీ పరీక్షలో సెక్షనల్ కట్-ఆఫ్ ఉండదు.

ఆబ్జెక్టివ్ టెస్టుల్లో తప్పు సమాధానాలకు పెనాల్టీ కూడా ఉంటుందని ఎస్​బీఐ పీఓ అభ్యర్థులు గుర్తించాలి. అభ్యర్థి తప్పుగా గుర్...