భారతదేశం, ఆగస్టు 5 -- ఇటీవల జరిగిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 13 పరీక్షను రద్దు చేయబోమని, అయితే పరీక్షలో అన్యాయం జరిగిన అభ్యర్థులకు రీ-టెస్ట్​ నిర్వహిస్తామని ఎస్‌ఎస్‌సీ చైర్మన్ ఎస్. గోపాలకృష్ణన్ తెలిపారు. పరీక్ష నిర్వహణలో లోపాలపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన చేశారు.

మరోవైపు పరీక్ష నిర్వహణ సంస్థ అయిన ఎడ్యుక్విటీ కెరీర్ టెక్నాలజీస్‌కు ఎస్‌ఎస్‌సీ లేఖ రాసింది. జులై 24 నుంచి ఆగస్టు 1 వరకు జరిగిన పరీక్షల్లో వచ్చిన అన్ని సమస్యలను పరిష్కరించాలని ఆ లేఖలో పేర్కొంది.

"మేము డేటాను విశ్లేషిస్తున్నాము. ఒక్క అభ్యర్థికి కూడా అన్యాయం జరిగిందని తేలితే, మేము వారికి మళ్లీ పరీక్ష నిర్వహిస్తాము," అని చైర్మన్ స్పష్టం చేశారు.

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, ఇతర సంస్థల్లో ఉద్యోగా...