Hyderabad, జూలై 17 -- ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులే కాదు.. దేశం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా ఎస్ఎస్ఎంబీ29. ఇంకా పేరు కూడా పెట్టకముందే ఈ మూవీపై ఇంత ఆసక్తి నెలకొనడానికి కారణం మహేష్ బాబు, రాజమౌళి అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన మునుపటి సినిమాల మాదిరిగా కాకుండా.. దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి.. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ తో చేయనున్న ఈ మూవీ గురించి ఎలాంటి వివరాలను వెల్లడించడం లేదు. అయితే టాంజానియాకు చెందిన 'ది సిటిజన్' అనే పత్రిక ఈ మూవీ రాబోయే షూటింగ్ షెడ్యూల్‌ను వెల్లడించడమే కాకుండా స్టోరీనీ లిక్ చేసింది.

ఆఫ్రికా జంగిల్ సఫారీ బ్యాక్‌డ్రాప్ లో ఈ ఎస్ఎస్ఎంబీ29 మూవీ సాగనుందని ఎన్నో రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలుసు కదా. ఇప్పుడు టాంజానియా పత్రిక కూడా అదే విషయం చెబుతోంది. రాజమౌళి, మహేష్ బాబు, ప్రియాంక చోప్...