Hyderabad, జూలై 4 -- టాలీవుడ్ అగ్ర నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు ప్రొడ్యూస్ చేసిన సరికొత్త తెలుగు మూవీ తమ్ముడు. నితిన్ హీరోగా, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమ్ముడు సినిమా ఇవాళ (జూలై 4) థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఇటీవల ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో మూవీ రివ్యూస్‌పై నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

-తమ్ముడు మూవీకి అజనీష్ మంచి సౌండింగ్ డిజైన్ చేశాడు. మనమంతా కొత్త సినిమా కావాలనుకుంటాం. శ్రీరామ్ కూడా కొత్తగా ప్రయత్నిస్తా అన్నాడు. మేము ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చి చేయించాం. శుక్రవారం మార్నింగ్ షో చూసిన మీ అందరికీ మా సినిమా నచ్చితే సూపర్ హిట్ దక్కినట్లే.

-కథగా చూస్తే ఇది సింపుల్ స్టోరీ. అక్కా, తమ్ముడి మధ్య ఓ సమస్య రావడం, ఆ సమస్యను సాల్వ్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయత్నం చేశారు అనేది మూవీలో చూస్తారు. ఈ కథను స్క్రీన్ ప్లే...