భారతదేశం, ఆగస్టు 17 -- లైఫ్​ ఇన్సూరెన్స్​ కార్పొరేషన్​ (ఎల్‌ఐసీ) ఎల్ఐసీ ఏఏఓ, ఏఈ రిక్రూట్‌మెంట్ 2025కి సంబంధించిన నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఏఓ), అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ licindia.in ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ ద్వారా దేశవ్యాప్తంగా మొత్తం 841 పోస్టులను భర్తీ చేయనున్నారు. దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 16న ప్రారంభమై, సెప్టెంబర్ 8తో ముగుస్తుందని గుర్తుపెట్టుకోవాలి. పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

అసిస్టెంట్ ఇంజినీర్స్ (Assistant Engineers): 81 పోస్టులు

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఏఓ - స్పెషలిస్ట్): 410 పోస్టులు

అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (ఏఏఓ - జనరలిస్ట్): 350 పోస్టులు

విద్య...