భారతదేశం, జూలై 8 -- యోగినీ ఏకాదశి 2026: హిందూ ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి ఏకాదశి తిథికి ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఉంటుంది. అయితే, జ్యేష్ఠ మాస కృష్ణ పక్షంలో వచ్చే 'యోగినీ ఏకాదశి'కి ప్రత్యేకత ఉంది. ఈ ఏడాది జూలై 10, శుక్రవారం నాడు ఈ ఏకాదశి వచ్చింది. ఈ రోజున శ్రీ మహావిష్ణువును భక్తిపూర్వకంగా పూజించడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు తొలగిపోతాయని, జీవితంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. కేవలం వ్రతమే కాకుండా, కొన్ని విశేషమైన పరిహారాలు పాటించడం ద్వారా మీ జీవితంలోని ప్రతికూలతలను దూరం చేసుకోవచ్చు.

దాన ధర్మాలు: ఏకాదశి రోజున అన్నదానం లేదా వస్త్రదానం చేయడం అత్యంత పుణ్యప్రదం. మీ శక్తి మేరకు చేసే దానం అక్షయమైన ఫలితాలను ఇస్తుంది.

తులసీ మాత ఆరాధన: వైవాహిక జీవితంలో భార్యాభర్తల మధ్య గొడవలు, మనస్పర్థలు ఉంటే, ఈ రోజున తులసీ మాతకు పూజ చేయండి. లక్...