భారతదేశం, జూలై 15 -- భారత దేశం ఎంతగానో ఎదురుచూస్తున్న ఘట్టం నేడు ఆవిష్కృతం కానుంది! దిగ్గజ ఎలక్ట్రిక్​ వాహనాల తయారీ సంస్థ టెస్లా, ఎట్టకేలకు నేడు ఇండియాలో తన మొదటి ఎక్స్​పీరియెన్స్​ సెంటర్​ను లాంచ్​ చేయనుంది. ఇందుకోసం ముంబై బీకేసీ సెంటర్​లో షోరూమ్​ సిద్ధమైంది. అయితే, ప్రస్తుత టెస్లా సీఈఓ, అపర కుబేరుడు ఎలాన్​ మస్క్​.. ఈ సంస్థకు ఒరిజినల్​ ఫౌండర్​ కాదన్న విషయం మీకు తెలుసా? ఒక ఇన్వెస్టర్​గా కంపెనీలోకి వచ్చి, మొత్తం సంస్థనే తన గుప్పిట్లోకి తీసుకున్నారు మస్క్​. ఈ కథ తెలిస్తే మీరు షాక్​ అవుతారు.

2003 జులైలో టెస్లా మోటార్స్‌ను మార్టిన్ ఎబెర్‌హార్డ్, మార్క్ టార్పెనింగ్ అనే ఇద్దరు అమెరికన్​ ఇంజినీర్లు స్థాపించారు. దిగ్గజ ఎలక్ట్రికల్ ఇంజనీర్ నికోలా టెస్లాకు నివాళిగా కంపెనీకి ఆ పేరు పెట్టారు. ఎబెర్‌హార్డ్ ఒక ఎలక్ట్రికల్​ ఇంజినీర్​. టార్పెనింగ్ ఒక కంప...