భారతదేశం, డిసెంబర్ 6 -- మీకు ఎప్పుడూ, ఏదో ఒకటి తినే అలవాటు ఉందా? ఈ అలవాటు (రోజుకు రెండుసార్లు క్రమం తప్పకుండా బ్రష్ చేసినప్పటికీ) మీ దంతాల ఆరోగ్యానికి ముప్పుగా మారే అవకాశం ఉంది మీకు తెలుసా? రోజంతా చిరుతిళ్లు (స్నాకింగ్) తింటూనే ఉండటం వల్ల అనేక సమస్యలు తలెత్తుతాయని, అందుకే అతిగా తినాలనే కోరికను నియంత్రించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఎందుకు చిరుతిళ్ల అలవాటును అదుపులో పెట్టుకోవాలో అర్థం చేసుకోవడానికి, హెచ్‌టీ లైఫ్‌స్టైల్, దంతవైద్య నిపుణురాలు, స్మైల్ కాన్సెప్ట్స్ మల్టీ-స్పెషాలిటీ డెంటల్ క్లినిక్ సహ వ్యవస్థాపకురాలు డాక్టర్ నికితా మోత్వానిని సంప్రదించింది.

ఆమె చెప్పిన దాని ప్రకారం.. మీరు రోజుకు రెండుసార్లు బ్రష్ చేసినా కూడా, నిరంతరాయంగా స్నాక్స్ తీసుకోవడం వల్ల కలిగే నష్టం పూడ్చలేనిది! డాక్టర్ మోత్వాని తన క్లినికల్ ప్రాక్టీస్ ఆధారంగా తన ప...