Hyderabad, సెప్టెంబర్ 25 -- చాలామంది పెళ్లి కుదరక ఇబ్బంది పడుతూ ఉంటారు. పెళ్లి కాని వారు కాత్యాయని వ్రతాన్ని ఆచరించడం వలన శుభఫలితాలను పొందవచ్చు. త్వరలో పెళ్లి ఘడియలు వస్తాయి. పెళ్లి కావలసిన అమ్మాయిలు, వివాహ జీవితంలో ఇబ్బందులు ఎదుర్కొనేవారు, వివాహంలో ఆటంకాలు ఉన్న వారు, రాహు-కేతువు దోషాలు ఉన్న వారు కాత్యాయని వ్రతాన్ని ఆచరించడం మంచిది. అయితే అసలు కాత్యాయని వ్రతం అంటే ఏంటి? కాత్యాయని వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఎలా కాత్యాయని దేవిని పూజించాలి? వంటి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకుందాం.

పార్వతీ దేవికి మరో పేరు కాత్యాయని. కాత్యాయని వ్రతాన్ని ఆచరిస్తే త్వరగా పెళ్లి అవుతుంది. ఈరోజు కూడా కాత్యాయని వ్రతం చేసుకోవచ్చు. అదేవిధంగా మార్గశిర మాసంలో కూడా కాత్యాయని వ్రతం చేయొచ్చు.

భక్తిశ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే వైవాహిక జీవితంలో ఇబ్బందులు తొలగిపోతాయి. పెళ్ల...