భారతదేశం, అక్టోబర్ 28 -- లక్ష్యం కోసం వీరు చేసే త్యాగం, చూపించే అంకితభావం సమాజంలో వీళ్లను ప్రత్యేకంగా నిలబెడుతుంది. జ్యోతిష్య నిపుణుల అంచనా ప్రకారం, సింహం, వృశ్చికం, మకరం రాశుల వారు ఈ ప్రత్యేకమైన గుణగణాలతోనే ముందుకు సాగుతుంటారు.

సింహ రాశికి అధిపతి సూర్య భగవానుడు. జ్యోతిష్య శాస్త్రంలో సూర్యుడిని ఆత్మవిశ్వాసం, ప్రతిష్ట, నాయకత్వ లక్షణాలకు ప్రతీకగా చెబుతారు. ఈ కారణంగానే సింహ రాశి వారు అత్యంత ప్రభావశీలమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. సమాజంలో తమకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకోవాలని పరితపిస్తుంటారు. ఎంత పెద్ద లక్ష్యమైనా సరే వెనుకాడకుండా సాధించి తీరుతామనే పట్టుదల వీరిలో ఉంటుంది.

తాము చేసే పనికి గుర్తింపు దక్కాలని, నలుగురిలో గౌరవం ఉండాలని కోరుకుంటారు. ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఎంతటి కష్టానికైనా సిద్ధపడతారు. సమస్యలు ఎదురైనప్పుడు పారిపో...