భారతదేశం, ఫిబ్రవరి 9 -- ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న 'స్పిరిట్' మూవీ మొదటి నుంచి వార్తల్లోనే ఉంది. హీరోయిన్ గా దీపికా పదుకొణెను తప్పించి త్రిప్తి డిమ్రిని తీసుకున్నారు. దీపికాపై వేటు వివాదం కొంతకాలం పాటు నడించింది. ఇప్పుడేమో ప్రకాష్ రాజ్ ను తప్పించారనే వార్తలు వస్తున్నాయి. వీటిపై ప్రకాష్ రాజ్ స్పందించాడు.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో విభేదాల కారణంగా స్పిరిట్ నుంచి ప్రకాష్ రాజ్ తప్పుకొన్నాడనే వార్తలు హాట్ టాపిక్ గా మారాయి. దీనిపై హిందూస్థాన్ టైమ్స్ ప్రకాష్ రాజ్ ను సంప్రదించింది. ఈ ఊహాగానాలను ప్రకాష్ రాజ్ కొట్టిపడేశాడు. ''ఇవి అర్థం లేని పుకార్లు. నాకు దీని గురించి ఏమీ తెలియదు' అని క్లారిటీనిచ్చాడు. స్పిరిట్ మూవీలో నటిస్తున్నట్లు కన్ఫామ్ చేశాడు.

స్పిరిట్ సినిమా చుట్టూ వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఫస్ట్ ఏమో హీరోయిన్...