భారతదేశం, జనవరి 28 -- రాష్ట్ర ప్రభుత్వం ఎక్సైజ్ శాఖలో మరో కుంభకోణానికి తెరలేపిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మైక్రో బ్రూవరీస్ దక్కించుకునేందుకు 110 అప్లికేషన్లు వచ్చాయని చెప్పారు. ఇందులో 25 అప్లికేషన్ల టెండర్లు ముఖ్యనేతకు, మంత్రికి ఇచ్చేందుకు సిద్ధమయ్యాయని ఆరోపించారు.మిగిలిన 4 మంత్రి కోటా కింద కేటాయించారని చెప్పారు.

బుధవారం తెలంగాణ భవన్‌లో మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు చిట్‌చాట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. "సింగరేణిలో బయటపెట్టాల్సిన కుంభకోణాలు ఇంకా ఉన్నాయి. ఈరోజు ఎక్సైజ్ శాఖలో కుంభకోణాన్ని బయటపెడుతున్నా. ఈ మధ్య ముఖ్య నేతకు నీడగా ఉండే వ్యక్తి వార్తల్లో నిలుస్తున్నారు. ముఖ్య నేతకు నీడగా ఉండే ఆ నేత నేరుగా ముఖ్య నేత ఇంటికి వెళ్తారు. ఈ మధ్య ముఖ్యనేత తిరుపతికి పోయినప్పుడు నీడగా ఉన్నాడు ఒక్కొక్క బ్రూవరీ దగ్గర అన్అఫీషియల్‌గా...