భారతదేశం, జూన్ 9 -- మన హిందూ సంప్రదాయంలో తులసి మొక్కకు ఉన్న ప్రాముఖ్యత గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ప్రతి ఒక్కరి ఇంట్లో తులసి మొక్క ఉంటుంది. తులసి మొక్క ఇంట్లో ఉంటే లక్ష్మీదేవి ఉన్నట్లే అని భావిస్తారు. ఒకవేళ తులసి మొక్క ఎండిపోయినట్లయితే మీరు బాధపడకండి. ఎండిపోయిన తులసి మొక్క కూడా అంతే పవిత్రమైనది.

తులసి మొక్కలో లక్ష్మీదేవి ఉంటుందని, విష్ణువుకు తులసి అంటే చాలా ఇష్టమని విశ్వసిస్తారు. తులసి మొక్కను ఎట్టి పరిస్థితుల్లోనూ అవమానించడం మంచిది కాదు. అలాగే, తెలియక గానీ తెలిసి గానీ తులసి మొక్కకు సంబంధించిన తప్పులు చేయకూడదు. అలా చేస్తే విష్ణుమూర్తికి ఆగ్రహం కలిగి ఇబ్బందులు రావచ్చు. ఇంట్లో తులసి మొక్క ఎండిపోయినట్లయితే దానిని పారేయకండి. ఈ పరిహారాలను పాటించచ్చు. ఆధ్యాత్మికంగా తులసి మొక్కను ఎండిపోయిన తర్వాత కూడా ఉపయోగించవచ్చు. అది ఎలా అనేది ఇప్పు...