భారతదేశం, జూలై 29 -- భారతదేశంలో లక్షలాది మంది విద్యార్థులకు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లో ప్రవేశం పొందడం ఒక కల. ఐఐటీలో చదవడం వల్ల వృత్తిపరమైన ఎదుగుదలే కాకుండా, అభివృద్ధి దృక్పథం ఉన్న విద్యార్థులతో పరిచయం, అనుభవజ్ఞులైన, ఉన్నత అర్హతలు కలిగిన ప్రొఫెసర్ల మార్గదర్శకత్వం, అత్యాధునిక ప్రయోగశాల సౌకర్యాలు, బలమైన ప్లేస్‌మెంట్ మద్దతు వంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. మరి ఉద్యోగం చేస్తూ కూడా చదువుకోవచ్చా? అంటే, యెస్​ అని చెప్పాలి. కొన్ని ఐఐటీల్లో పార్ట్​ టైమ్​ కోర్సులు ఉన్నాయి. వాటిని వర్కింగ్​ ప్రొఫెషనల్స్​ కోసమే రూపొందించడం జరిగింది. వివరాల్లోకి వెళితే..

ఐఐటీలో ప్రవేశం పొందడానికి చాలా మార్గాలున్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్/ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ చేయాలనుకునే విద్యార్థులు జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్‌డ్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించాలి. మ...