భారతదేశం, అక్టోబర్ 27 -- ప్రతి ఒక్కరూ కూడా ఉదయం లేచిన తర్వాత కొన్ని పనులను మొదలు పెడుతూ ఉంటారు. అయితే, ఉదయం లేచిన వెంటనే ఈ ఆధ్యాత్మిక నియమాలను పాటిస్తే మనసులో ఉత్సాహం పెరుగుతుంది. సానుకూల శక్తి కూడా వ్యాపిస్తుంది. అలాగే, ఉదయం పూట కొన్ని పనులను చేయడం వలన ఎన్నో విధాలుగా లాభాలను పొందవచ్చు.

ఉదయం పూట మన దినచర్య ఏ విధంగా మొదలవుతుందనే దానిపైనే మన రోజంతా కూడా ఆధారపడి ఉంటుంది. మనం ఉదయం లేచిన తర్వాత చేసే పనులతో మన మానసిక స్థితి, శక్తి ఆధారపడి ఉంటాయి. ఉదయం చిరునవ్వుతో, ప్రశాంతంగా రోజును మొదలుపెట్టినట్లయితే రోజంతా కూడా పూర్తి ఏకాగ్రతతో పనులను జాగ్రత్తగా పూర్తి చేసుకోవచ్చు. అదే ఉదయాన్నే కాస్త చిరాకుగా, కోపంతో రోజును మొదలుపెడితే ఒత్తిడి, ఆందోళనతో రోజంతా సతమతం అవ్వాల్సి ఉంటుంది.

మన సంప్రదాయాలు, జ్యోతిష్య శాస్త్రంలో ఉదయం పూట ఆచరించాల్సిన కొన్ని పద్ధతుల...