భారతదేశం, నవంబర్ 4 -- రాశుల ఆధారంగా మనం చాలా విషయాలను చెప్పవచ్చు. రాశుల ఆధారంగా ఒక మనిషి తీరు, ప్రవర్తన ఎలా ఉంటుందో చెప్పడంతో పాటు, భవిష్యత్తు ఎలా ఉంటుందనేది కూడా చెప్పడానికి వీలవుతుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చూసినట్లయితే, ఒక్కో రాశి వారి ప్రవర్తన తీరు ఒక్కో విధంగా ఉంటాయి. కొన్ని రాశుల వారికి ఇవి బలాలు అయితే, కొన్ని రాశుల వారికి అవే బలహీనత కావచ్చు.

జ్యోతిషశాస్త్రం ప్రకారం చూసినట్లయితే, కొన్ని రాశుల వారు దేని గురించి పెద్దగా బాధపడరు. ఎల్లప్పుడూ వారు ప్రశాంతంగా ఉండడానికి చూస్తారు. ఈ రాశుల వారు మొండి వారు అని మనం అనొచ్చు. సాధారణంగా ఏదైనా సమస్య వస్తే చాలా మంది భయపడిపోతూ ఉంటారు, బాధ పడిపోతూ ఉంటారు, దాని గురించి తలుచుకుని తిండి, తిప్పలు మానేసి బెంగపడిపోతూ ఉంటారు.

కానీ కొంతమంది ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యంగా ఉంటారు, సమస్యను పెద్దగా పట్టించ...