భారతదేశం, ఆగస్టు 7 -- మేధావిగా, గొప్ప అర్థశాస్త్రవేత్తగా, రాజనీతిజ్ఞుడిగా ఆచార్య చాణక్యుడికి ప్రత్యేక స్థానం ఉంది. ఆయన అందించిన 'చాణక్య నీతి' మనిషి జీవితాన్ని సరైన మార్గంలో నడిపించడానికి ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. మానవ సంబంధాలు, స్నేహాలు, శత్రువులు, కుటుంబం మరియు సమాజంలో ఎలా ప్రవర్తించాలనే అంశాలపై ఆయన ఎన్నో అమూల్యమైన సూత్రాలు చెప్పారు.

కుటుంబం తర్వాత జీవితంలో కష్ట సుఖాల్లో తోడుండేది మిత్రుడే అని అందరూ నమ్ముతారు. అయితే, ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మి స్నేహం చేయడం వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ఏయే లక్షణాలున్న వ్యక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ దూరంగా ఉండాలో ఆయన తన శ్లోకాల ద్వారా స్పష్టంగా వివరించారు.

మనిషి జీవితంలో స్నేహితులను ఎంపిక చేసుకునేటప్పుడు ఎంతో అప్రమత్తంగా ఉండాలని చాణక్య సూచిస్తున్న...