భారతదేశం, నవంబర్ 12 -- టాలీవుడ్‌కు ఓ డిఫరెంట్ కామెడీ టచ్ ఇచ్చిన డైరెక్టర్లలో ఒకడు తరుణ్ భాస్కర్. మంచి నటుడు కూడా. తాజాగా అతడు నటించిన మూవీ సంతాన ప్రాప్తిరస్తు. ఈ సినిమా శుక్రవారం (నవంబర్ 14) రిలీజ్ కానుండగా.. ఇదో తెలుగింటి భోజనంలాగా ఉంటుందని తరుణ్ భాస్కర్ అనడం విశేషం. మధుర ఎంటైర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానెల్ లో మూవీ హీరో విక్రాంత్ తో కలిసి మాట్లాడాడు.

హీరో విక్రాంత్ తో తరుణ్ భాస్కర్ మాట్లాడాడు. ఈ సందర్భంగా సంతాన ప్రాప్తిరస్తు మూవీ గురించి అతడు మాట్లాడుతూ.. మొదట ఈ సినిమా చేయొద్దని అనుకున్నానని, కానీ ఈ కాలంలో ఎంతో మంది ఫేస్ చేస్తున్న కిడ్స్ ప్రాబ్లెమ్ గురించి కావడంతో తర్వాత అంగీకరించినట్లు చెప్పాడు. అయితే మూవీ చేసిన తర్వాత తాను చాలా హాయిగా ఫీలయ్యానని, చూసిన తర్వాత మరింత సంతృప్తి కలిగిందని తెలిపాడు. ఈ సినిమా ఓ తెలుగింటి భోజనంలాగా ఉంటుందని అతడు ...