Hyderabad, అక్టోబర్ 7 -- టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్.. రిషబ్ శెట్టి లేటెస్ట్ కన్నడ మూవీ 'కాంతార ఛాప్టర్ 1' చూసి 'మైమరచిపోయానని' అన్నాడు. అతడు తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఈ సినిమాపై తన రివ్యూను పంచుకున్నాడు. ఇది మంగళూరు సంప్రదాయాలను, ప్రజలను చాలా కచ్చితత్వంతో చూపించిందని ప్రశంసించాడు.

కాంతార ఛాప్టర్ 1 సినిమా సెలబ్రిటీ అభిమానుల జాబితాలో టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్ కూడా చేరిపోయాడు. కర్ణాటకకే చెందిన ఈ స్టార్ క్రికెటర్ ఈ సినిమాపై ప్రశంసల వర్షం కురిపించాడు. రాహుల్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో 'కాంతార ఛాప్టర్ 1' టైటిల్ కార్డు పోస్టర్ పోస్ట్ చేశాడు. సినిమా చూసిన తర్వాత తన మతిపోయినట్లు చెప్పాడు. అతడు తన రివ్యూలో ఇలా రాశాడు.

"ఇప్పుడే కాంతార చూశాను. రిషబ్ శెట్టి మరోసారి సృష్టించిన ఈ మాయాజాలానికి మైమరచిపోయాను. మంగళూరు ప్రజలను, వాళ్ల వి...