Hyderabad, ఆగస్టు 1 -- ప్రేక్షకులను ఓ సినిమా నవ్విస్తుంది. ఏడిపిస్తుంది. ప్రేమలో పడేలా చేస్తుంది. ఇప్పుడలాంటిదే బాలీవుడ్ లో ఓ మూవీ సంచలనం సృష్టిస్తోంది. అహాన్ పాండే, అనీత్ పడ్డా నటించిన 'సయ్యారా' మూవీ గురించి మనం చెప్పుకుంటున్నది. ఈ సినిమా విడుదలైన తర్వాత థియేటర్లలో అభిమానులు అరిచే, ఏడ్చే, స్పృహ కోల్పోయే వీడియోలు సోషల్ మీడియాలో చాలా వచ్చాయి. ఇది మూవీ ప్రమోషన్లలో భాగమా అనే ప్రశ్నలు పలువురు లేవనెత్తారు. అయితే, ఈ వార్తలను సినిమా నిర్మాత, యష్ రాజ్ ఫిల్మ్స్ (YRF) సీఈఓ అక్షయ్ విధాని తోసిపుచ్చాడు.

సయ్యారా మూవీ, ఆ సినిమా చూస్తున్న ప్రేక్షకుల రియాక్షన్ గురించి ప్రొడ్యూసర్ అక్షయ్ స్పందించాడు. ఇండియా టుడేతో మాట్లాడిన అక్షయ్ ఇవి ప్రమోషన్లన్న వార్తలను ఖండించాడు. "ఆ వ్యక్తుల్లో ఎవరినీ థియేటర్లలో మేము ప్లాన్ చేసి పెట్టలేదు" అని స్పష్టం చేశాడు.

"చేతికి...