భారతదేశం, నవంబర్ 6 -- ప్రముఖ మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన ద్విభాషా చిత్రం 'కాంత'. ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పీరియాడికల్ కథాంశంతో రూపొందించిన ఈ సినిమా ట్రైలర్ గురువారం (నవంబర్ 6) విడుదలవగా.. ఇందులో దుల్కర్ ఏం చూపించబోతున్నాడో చూడాలని అభిమానులు ఉత్సాహంగా ఉన్నారు.

ఈ సందర్భంగా జరిగిన ట్రైలర్ లాంచ్‌ ఈవెంట్‌లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు. నటుడు, నిర్మాత రానా దగ్గుబాటి మాట్లాడుతూ దుల్కర్‌ని ఆకాశానికెత్తేశారు. 'కాంత'లో దుల్కర్ నటన చూసిన తర్వాత తాను ఆయనకు ఫ్యాన్ అయ్యానని రానా తెలిపారు.

దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో నటించిన కాంత మూవీ నవంబర్ 14న రిలీజ్ కానుండగా.. తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వేదికపై విలేకరులతో మాట్లాడిన రానా దగ్గుబాటి.. దుల్కర్ సల్మాన్ అద్భుతమైన నటుడని ప్రశంసించారు. "'నడిప్పు చక్రవ...