భారతదేశం, ఫిబ్రవరి 19 -- బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు విశాల్ భరద్వాజ్ తెరకెక్కించిన తాజా మూవీ 'ఓ రోమియో' (O'Romeo). షాహిద్ కపూర్, నేషనల్ క్రష్ తృప్తి దిమ్రి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా వాలెంటైన్స్ డే కానుకగా ఫిబ్రవరి 13న థియేటర్లలో విడుదలైంది. విమర్శకుల నుంచి ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూస్ లభించాయి. అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా తన సత్తా చాటుతోంది.

బాలీవుడ్ మూవీ 'ఓ రోమియో'పై వస్తున్న విమర్శల గురించి డైరెక్టర్ విశాల్ భరద్వాజ్ స్పందించాడు. ఈ సినిమా ఇంకా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల మార్క్‌ను చేరుకోనప్పటికీ, ఇది తన కెరీర్‌లోనే అత్యంత విజయవంతమైన సినిమా అవుతుందని అతడు నమ్మకంతో ఉన్నాడు. పీటీఐ (PTI) వార్తా సంస్థతో అతడు మాట్లాడాడు.

"ఈ సినిమాను విమర్శించిన వారి గుండెలు పగిలేలా నేను ఒక విషయం చెప్పాలి. వాళ్ళు ఏమనుకున్నా సరే నా జీవితంలో ఇ...