భారతదేశం, సెప్టెంబర్ 23 -- ఈ వారం ఓటీటీలోకి చాలా మలయాళం సినిమాలు వస్తున్నాయి. డిఫరెంట్ జోనర్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కోసం సిద్ధమయ్యాయి. ఇందులో హారర్, సస్పెన్స్ థ్రిల్లర్లూ ఉన్నాయి. ఈ మలయాళ సినిమాల్లో కొన్ని టాప్ మూవీస్ ఏ ఓటీటీల్లోకి? ఎప్పుడు? వస్తున్నాయో చూసేద్దాం.

సర్కీట్ అనేది ఉద్యోగం కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళిన ఒక యువకుడు అమీర్ కథ. అతను జెప్పు అనే అతి చురుకైన మలయాళి పిల్లవాడిని కలుస్తాడు. అతనిని అదుపులో ఉంచడం అతని తల్లిదండ్రులకు చాలా కష్టం. ఉద్యోగం లేని యువకుడు, పిల్లల మధ్య బంధం ఈ హృదయపూర్వక చిత్రంలో మానవ సంబంధాల గురించి ఒక హృద్యకథగా చూపించబడింది.

నటీనటులు: ఆసిఫ్ అలీ, దివ్య ప్రభ, ఓర్హాన్ హైదర్

ఓటీటీ విడుదల తేదీ: సెప్టెంబర్ 26

ఓటీటీ ప్లాట్‌ఫామ్: మనోరమ మాక్స్

హృదయపూర్వం మూవీ 40 ఏళ్ల మలయాళి వ్యక్తి గురించి. ఇందులో మోహన్ లాల్ లీడ్...