భారతదేశం, సెప్టెంబర్ 25 -- ఓటీటీలోకి ఈ వారం కొత్త కంటెంట్ వచ్చింది. ఇంకా రాబోతుంది కూడా. ఇందులో హారర్ థ్రిల్లర్లు ఆడియన్స్ ను బాగా ఎంటర్ టైన్ చేస్తున్నాయి. ఓటీటీలో హారర్ థ్రిల్లర్స్ కు ఉండే ఫ్యాన్ బేస్ వేరే లెవల్. వీటికి ఉండే క్రేజ్ వేరు. భాషతో సంబంధం లేకుండా హారర్ థ్రిల్లర్లను తెలుగు ఆడియన్స్ ఎంజాయ్ చేస్తుంటారు. అలాంటి వేరే లెవల్ హారర్ పంచే థ్రిల్లర్లు ఓటీటీలో అందుబాటులో ఉన్నాయి. వీటిపై ఓ లుక్కేయండి.

వేరే లెవల్ హారర్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆడియన్స ను భయపెట్టే సిరీస్ ఇది. అలైస్ ఇన్ బార్డర్ ల్యాండ్ సిరీస్ లో భాగంగా సీజన్ 3 ఓటీటీలోకి వస్తోంది. ఇవాళ (సెప్టెంబర్ 25) నుంచే ఈ సీజన్ స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ ఓటీటీ నెట్‌ఫ్లిక్స్‌ ప్లాట్ ఫామ్ లో ఈ సీజన్ ఆడియన్స్ కు అందుబాటులోకి వచ్చింది.

ఇది కేవలం హారర్ మాత్రమే కాదు. ఇందులో సైన్స్ ఫిక్షన్...