భారతదేశం, సెప్టెంబర్ 20 -- ఈ వారం కొన్ని వెబ్ సిరీస్ లు ఓటీటీ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు దూసుకొచ్చాయి. ఇందులో కొన్ని చాలా స్పెషల్ గా ఉన్నాయి. బోల్డ్, రొమాంటిక్, థ్రిల్లర్ జోనర్లలో ఉన్న ఈ వెబ్ సిరీస్ లు ఏంటీ? అవి ఏ ఓటీటీల్లో ఉన్నాయో ఓ లుక్కేయండి.

ఈ వారమే కాదు అంతకంటే ముందు నుంచే ఎక్కువగా హైప్ తో ట్రెండింగ్ లో కొనసాగుతున్న వెబ్ సిరీస్ 'బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్'. షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ డైరెక్టర్ గా మారి తెరకెక్కించిన ఫస్ట్ వెబ్ సిరీస్ ఇది. ఇది బాలీవుడ్ పై సెటైరికల్ సిరీస్ గా రూపొందింది. ఇందులో దిగ్గజ డైరెక్టర్ రాజమౌళి, సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్ తదితరులు క్యామియోలు ప్లే చేశారు. ఇప్పటికే బ్లాక్ బస్టర్ టాక్ అందుకున్న ఈ సిరీస్ ఓటీటీలో అదరగొడుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులోనూ స్ట్రీమింగ్ అవుతోంది.

సూపర్ హీరోస్ స్టోరీతో వ...