భారతదేశం, ఆగస్టు 15 -- ఈ వారం జీ5, మనోరమ మ్యాక్స్, సోనీలివ్, నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్ట్స్, జియోహాట్‌స్టార్ వంటి ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ లో వెబ్ సిరీస్ లు రిలీజ్ అయ్యాయి. ఇందులో కొన్ని థ్రిల్లర్లూ ఉన్నాయి. ఇందులో హారర్, స్పై, కోర్టు, సైన్స్ ఫిక్షన్ జోనర్లున్నాయి. వీటిపై ఓ లుక్కేయండి. ఈ వీకెండ్ కు బెస్ట్ ఛాయిస్.

ఓటీటీలో ఉన్న ఈ సిరీస్ పరం మాథుర్ అనే యువ న్యాయవాది చుట్టూ తిరుగుతుంది. అతను తన తండ్రి పనిని ఒక జిల్లా కోర్టులో చేయడానికి బలవంతంగా వస్తాడు. ఈ టీవీఎఫ్ వెబ్ సిరీస్ అతని కోర్టు గొడవలు, నైతిక ఎంపికలు, భారతదేశంలోని కఠినమైన న్యాయ వ్యవస్థలో కుటుంబ ఒత్తిళ్లను అన్వేషిస్తుంది. పవన్ మల్హోత్రా, ఆశిష్ వర్మ, పునీత్ బత్రా తదితరులు నటించారు. ఆగస్టు 12న సోనీ లివ్ ఓటీటీలో రిలీజైంది ఈ సిరీస్.

ఏలియన్ సినిమాకు రెండు సంవత్సరాల ముందు జర...