భారతదేశం, సెప్టెంబర్ 26 -- ఈ వారం ఓటీటీలో తెలుగు సినిమాలు అదరగొడుతున్నాయి. స్పెషల్ మూవీస్ స్ట్రీమింగ్ కు వచ్చాయి. అనుష్క ప్రధాన పాత్ర పోషించిన ఘాటి మూవీ నుంచి శ్రీలీల రొమాంటిక్ సినిమా జూనియర్ వరకు ఈ వారం ఓటీటీలో ఆడియన్స్ ను అలరిస్తున్నాయి.

ఆంధ్రా-ఒడిశా సరిహద్దులోని తూర్పు కనుమలలో స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే మూవీ ఘాటి. క్రూరమైన నాయుడు సోదరుల ఆధ్వర్యంలో జరిగే అక్రమ రవాణాలో చిక్కుకున్న అట్టడుగు సమాజం 'ఘాటీలు' పోరాటాలను ఇది చూపిస్తుంది. కుందుల్ నాయుడు, కాస్తాల నాయుడు నేతృత్వంలోని సిండికేట్ కు వ్యతిరేకంగా షీలావతి, దేశీరాజు ఒక శక్తివంతమైన కథలో నిలబడతారు. ఇందులో అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు, చైతన్య రావు, జగపతిబాబు తదితరులు నటించారు. ఇవాళ (సెప్టెంబర్ 26) ఓటీటీలోకి రిలీజైంది మూవీ. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది.

తమిళంలో కూడా అందుబాటు...