భారతదేశం, ఆగస్టు 26 -- జీ5, నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీలైవ్, జియోహాట్‌స్టార్‌ వంటి ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ఈ వారం చాలా కొత్త సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కానున్నాయి. ఇందులో కొన్ని క్రేజీ మూవీస్, సిరీస్ కూడా ఉన్నాయి. అవేంటో ఓ సారి చూసేద్దాం.

దాదాపు దివాళా తీసిన ర్యాంబో అనే ఎంటర్ ప్రెన్యూర్ కు తన వ్యాపారాన్ని కాపాడుకోవడానికి కొత్త ఇన్వెస్టర్ కావాలి. అతనికి సహాయం చేసే ఇన్వెస్టర్ ఎవరో కాదు అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. అతను ఇంతకు ముందు ఆమెను మోసం చేస్తాడు. ఫలితంగా అతని వ్యక్తిగత, వృత్తిగత జీవితంలో గందరగోళం నెలకొంటుంది. ఈ కామెడీ రొమాంటిక్ సిరీస్ ర్యాంబో ఇన్ లవ్ ఆగస్టు 29 నుంచి జియోహాట్‌స్టార్‌ లో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో పాయల్ చెంగప్ప, అభినవ్ మణికంఠ తదితరులు నటించారు.

కేరళ రాజధానిలో జరిగే ఈ 4.5 గ్యాంగ్ మూవీ కథలో మురికివా...