భారతదేశం, అక్టోబర్ 19 -- జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారానికి చాలా ప్రాధాన్యత ఉంది. గ్రహాల కలయిక వల్ల ఏర్పడే యోగాలు మానవ జీవితాలపై, రాశుల ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతాయి. అక్టోబర్ 19 నుంచి ప్రారంభమైన ఈ కొత్త వారంలో ఆకాశంలో అరుదైన గ్రహ స్థితి నెలకొంది.

ఈ వారంలో లక్ష్మీ నారాయణ రాజయోగం, హంస రాజయోగం, మాళవ్య రాజయోగం, గురు మంగళ యోగం, బుధాదిత్య రాజయోగం వంటి శక్తివంతమైన యోగాలు ఏర్పడుతున్నాయి. ఈ అద్భుతమైన రాజయోగాల ప్రభావంతో పాటు వివిధ రాశుల సంచారం కారణంగా రాబోయే ఏడు రోజులు కొందరికి అత్యంత అనుకూలంగా మారనున్నాయి.

ప్రస్తుత వారంలో గ్రహాల గమనాన్ని పరిశీలిస్తే.. గురు, మంగళ గ్రహాలు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాయి. చంద్రుడు మకరం, కుంభం, మీనం, మేష రాశులలో ప్రయాణిస్తాడు. అలాగే బుధుడు, సూర్యుడు, శుక్రుడు తుల రాశిలో సంచరిస్తుండగా.. శని మీన రాశిలో, రాహువు క...