Hyderabad, ఆగస్టు 14 -- అమితాబ్ బచ్చన్ హోస్ట్ చేస్తున్న క్విజ్ షో 'కౌన్ బనేగా క్రోర్‌పతి 17వ సీజన్ ప్రారంభమైంది. ఈ షో మొదలై 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సిల్వర్ జూబ్లీ వేడుకతో ప్రారంభమైంది. బుధవారం (ఆగస్టు 13) రాత్రి ప్రసారమైన 3వ ఎపిసోడ్‌లో మ్యాథమెటిక్స్ లో నైపుణ్యం ఉన్న కశిష్.. హాట్ సీట్‌లో కూర్చుని మంచి ప్రైజ్ మనీ గెలుచుకున్నారు.

తన తండ్రి అప్పు తీర్చడానికి సరిపడా డబ్బులు గెలుచుకున్న ఈ యువతికి అమితాబ్ బచ్చన్ శుభాకాంక్షలను తెలిపాడు. కష్టాలను ఎదుర్కొని కూడా కశిష్ తన కలలను నెరవేర్చుకోవడమే కాకుండా తన కుటుంబాన్ని ఆర్థికంగా కూడా ఆదుకున్నారు.

తన ఆత్మవిశ్వాసం, తెలివితో కశిష్ చాలా ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పారు. ఆమె కోటి రూపాయల ప్రైజ్ మనీకి కేవలం ఒక ప్రశ్న దూరంలో ఉన్నప్పుడు గేమ్ నుంచి తప్పుకున్నారు. ఆ కష్టమైన ప్రశ్న ఏమిటి? దానిక...